ఆగమ గీతాలు

ఈ ఈశ్వరస్తుతి గీతాలు ఆగమగీతాలు కూడా. ఈశ్వరుడు నిన్ను సదా కనిపెట్టుకుని ఉన్నాడని పదే పదే చెప్పే గీతాలు. ఈశ్వరకృపకు మనం ఎలుగెత్తి ధన్యవాదాలు చెప్పే గీతాలు. అందుకని లోక రక్షకుడు ఉదయించిన ఈ రోజున, ఎంతో పవిత్రమైన ఈ రోజున, ఈ పుస్తకాన్ని మళ్ళా మీతో పంచుకుంటున్నాను.

ఈశ్వర స్తుతిగీతాలు

మొత్తం అరవై నాలుగు గీతాలకు తెలుగు అనువాదాల్నీ, విపులమైన ఒక పరిచయ వ్యాసంతో కలిపి ఇప్పుడు ఈశ్వర స్తుతిగీతాలు పేరిట ఇదుగో ఇలా మీకు అందిస్తున్నాను. ఇది నా 48 వ పుస్తకం.