బహుశా, బాహ్యశాసనాలనుంచీ, నియమనిబంధనలనుంచీ మాత్రమే కాక, అంతరంగపు ఆరాటాలనుంచీ, సూక్ష్మ, అతిసూక్ష్మ ప్రలోభాలనుంచీ బయటపడినవాడు మాత్రమే అవధూత గీతలాంటి గీతాన్ని పలకగలుగుతాడు.
నేను కంటున్న కల
ప్రాచీన చీనాకవీంద్రుడు తావోచిన్ కవిత్వంలా, జెన్ సన్యాసులూ, స్వయంగా మహనీయులైన కవులూ అయిన హాన్ షాన్, సైగ్యో, బషోల మాటల్ని గుర్తు చేస్తున్న ఈ వాక్యాలు నాకెంతో దిగులు పుట్టిస్తున్నాయి. ఏమంటే ఇది నా కల కూడా.
