కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ క్షణం కోసమో లేదా ఆ కల నెరవేరడంకోసమో ఏళ్ళకి ఏళ్ళు వేచి చూస్తూ ఉంటాం. ఈలోపు మనం కళ్ళు తెరిచిమూసేలోపే మన కల నిజమై సాక్షాత్కరిస్తుంది, మన కళ్ళని మనమే నమ్మలేనట్టుగా, మన చెవుల్ని మనమే నమ్మలేనట్టుగా.
ఎర్రపూల చెట్టు
మొన్న నేను నా గేయం 'ఎర్రపూల చెట్టు'ని ఎవరూ స్వరపరిచి గానం చెయ్యడం లేదు కాబట్టి నేనే ఏ.ఐ సహాయంతో ట్యూను చేసుకున్నానని పెట్టిన వీడియో ఆమె చూసారు. అపారమైన సహృదయతతో ఆమె ఆ గేయాన్ని తానిట్లా స్వరపరిచి పాడి నాకు పంపించారు. ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశీస్సులు కూడా.
గురుభక్తి
'నేను ఈ కురళ్ చెప్పినట్టే నడుచుకున్నాను. నేను చేసినదాని వల్ల ఎవరికీ ఏమీ హాని జరగలేదు. ఒకవేళ నేను చేసింది అయ్య తప్పే అనుకుంటే, నన్ను క్షమించగలరు' అన్నాడు.
