ఆ ప్రసంగమే ఒక పురస్కారం

సుంకర గోపాల్ ని మొదటిసారి విజయవాడలో కొన్ని శేఫాలికలు ఆవిష్కరణ రోజు విన్నాను. అంత అనర్గళంగా, అంత భావస్ఫోరకంగా మాట్లాడే వక్తల్ని ఈ తరంలో నేను చూడలేదు. ఎంత భావోద్వేగంతో మాట్లాడుతున్నా ఎక్కడా ఔచిత్యం, సంయనమం కోల్పోని వాగ్ఝరి ఆయనది.