దేనికైనా సిద్ధపడతాను, ఎంతకైనా తెగిస్తాను నన్నెవరు ముందు చేరదీస్తే వాళ్ళకి నా ప్రాణం పెడతాను నా కోసం ఆకాశాన్ని దిగిరమ్మని అడుక్కోను అందుకు బదులు నన్ను నేనే ఉదారంగా వెదజల్లుకుంటాను.
నా గురించి పాడుకున్న పాట-4
ముందుకిగాని, వెనక్కిగాని, పక్కకి గాని జీవితం ఎక్కడెక్కడ సంచలిస్తున్నా, నేను దానికి ముద్దిడుతుంటూనే ఉంటాను. దాని పగుళ్ళనీ, లోపాల్నీ పక్కన పెట్టి ఏ ఒక్క మనిషినీ, ఏ ఒక్క విషయాన్నీ దాటిపోకుండా ప్రతి ఒక్కదాన్నీ నాకోసమూ, ఈ పాటకోసమూ కూడా నాలో ఇంకించుకుంటాను.
నా గురించి పాడుకున్న పాట-3
పుట్టడమే ఒక భాగ్యంగా భావిస్తున్న వాళ్ళున్నారా అయితే వాళ్ళకి చెప్పడానికి వేగిరపడుతున్నాను మరణించడం కూడా అంతే అదృష్టమని నాకు తెలుసని.
