ఆ దృశ్యమంతా నేను అరాయించుకోగలిగాను, అది నా ప్రాణానికి హితవుగానే ఉండింది, నాకు బాగానే అనిపించింది, చివరకి ఆ అనుభవమంతా నా సొంతమైపోయింది, నేనే ఆ మనిషిని, ఆ దుఃఖితుణ్ణి, నేనక్కడే ఉన్నాను
నా గురించి పాడుకున్న కవిత-10
నేను జంతువుల్తో కలిసి జీవించగలనని అనుకుంటున్నాను, అవి పరమశాంత జీవులు, తమ ప్రపంచంలో తాముంటాయి, వాటికేసి ఎంతసేపేనా చూస్తూండిపోగలను.
నా గురించి పాడుకున్న పాట-9
ఒక గడ్డిపోచ కూడా బృహత్తారాసముదాయాల ప్రయాణానికి తక్కువకాదని నమ్ముతాను, ఒక పిపీలికం, ఒక ఇసుకరేణువు, ఒక పక్షిగుడ్డు కూడా అంతే పరిపూర్ణాలు, ఒక చిరుకప్ప ఉత్కృష్ట మహాకావ్యం, ఒక చిట్టీతతుప్ప స్వర్గమందిరాలకు అలంకారం కాగలదు.
