ఇప్పుడు ఆ రాత్రి లేదు, ఆ గోష్టి లేదు. కాని ఆ పాట ఉంది. 'ఏమి లీల నీ వినోదము/మాయామతివి నీవు/తెలియరాదు నీ విలాసము.' సీతారామశాస్త్రి నాకు తెలియని ఎత్తుల్లో విహరిస్తున్నాడని ఆ రాత్రే మొదటిసారిగా తెలుసుకున్నాను.
ఇంద్రనీలస్మృతి
'ఉషోదయాన్ని ఎవ్వడాపురా? నిశావిలాసమెంతసేపురా? నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా!' అన్నాడు సీతారామశాస్త్రి.
ఒక పద్యసముద్రం ఇంకిపోయింది
ఆ పార్థివ శరీరం అగ్నికి ఆహుతైపోయింది. చుట్టూ చిగురిస్తున్నకానుగ చెట్లు, వేపచెట్లు.. కవితావసంతుడు వసంతఋతువులో కలిసిపోయాడు.
నిబ్బరంగా నిల్చుందామనే అనుకున్నాను, కాని ఎక్కణ్ణుంచి వచ్చాయి అన్ని కన్నీళ్ళు.
