మరో గ్రంథాలయ ఉద్యమం

ఒక స్వాతంత్య్రపోరాటానికి ఒక ప్రభుత్వం ఎప్పటికీ నాయకత్వం వహించలేదు. అది ప్రజలే నడుపుకోవలసిన ఉద్యమం. ఆ మాటే చెప్పాను ఆ రోజు- పుస్తకాల పట్లా, గ్రంథాలయాల పట్లా ఆసక్తి పునరుజ్జీవం కావాలంటే మనం చూడవలసింది ప్రభుత్వం వైపూ, ప్రభుత్వోద్యోగుల వైపూ కాదు, ప్రజలవైపు, ముఖ్యంగా తల్లిదండ్రులవైపు అని చెప్పాను.

గ్రంథాలయాల నీడన

ఆధునిక అంధ్రదేశ చరిత్రలో సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గొప్ప విప్లవాత్మక పాత్ర పోషించిన గ్రంథాలయోద్యమ కేంద్రం అది. మా మాష్టారు హీరాలాల్ గారు ఒక సారి ఒక మాటన్నారు: 'ఆంధ్రదేశంలో జాతీయోద్యమమంటే గ్రంథాలయోద్యమమే' అని