ఆషాడ మేఘం- 9

పేయనార్ తన కవితల్లో విస్తారమైన వర్ణనకి పూనుకోడు. రూపకాలంకారాల్లో కూడా కొత్తదనం కోసం చూడడు. కవిసమయాలు అప్పటికే నిర్ధారితమైపోయి ఉన్నాయి కాబట్టి వాటిని దాటి కూడా వెళ్ళడు. కాని ఆ చట్రం మధ్యనే క్లుప్తతనీ, గాఢతనీ సాధించడం ద్వారానూ, ఉక్తి వైచిత్రిద్వారానూ ఆయన రసోత్పత్తి సాధిస్తాడు.

ఆషాఢ మేఘం-8

ప్రతి మీనియేచర్ చిత్రలేఖనంలోనూ కనవచ్చే ఆ రంగులు, ఆ రేఖలు, ఆ లలితసుందరమైన భావోద్వేగమూ చూడగానే మనల్ని సమ్మోహపరచడం మనకి అనుభవమే కదా. అకనానూరు కవితల్లో కూడా  ఆ రంగులు, ఆ రేఖలు కలిసి సున్నితంగా చిత్రించే రసరమ్యలోకం అనువాదాల్ని కూడా దాటి ప్రయాణించగలిగింది అని మనం గ్రహిస్తాం.

ఆషాఢమేఘం-7

కాని కురుంతొగై సంగం తొలికాలపు కవిత్వం కాబట్టి, సంగం తిణైల స్వరూపస్వభావాలింకా స్థిరపడుతున్న కాలానికి చెందిన కవిత్వం కాబట్టి, అందులో తొలికవిత్వాల్లో ఉండే మౌలికతతో పాటు గొప్ప తాజాదనం కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడే విప్పారుతున్న విరజాజిపూలలాంటి కవితలవి.