ఈ ప్రపంచం మనదొక్కరిదే కాదు

నాకు ఆ పక్షుల్ని చూస్తుంటే ఒక స్లమ్‌లో అమ్మాయిల్ని చూసినట్టుంది. వాళ్ళుంటున్నది స్లమ్‌లోనేగానీ, అందరూ చక్కగా తయారై కాలేజికి వెళ్లడానికి సిటీబస్సు స్టాపు దగ్గర వేచి ఉన్నట్టుగా అనిపించింది.

ఋషీవాలీ పాఠశాల

ఋషీవాలీ విద్యాసంస్థల్తో నా పరిచయం ఇరవయ్యేళ్ళ కిందటిది. యునిసెఫ్ సలహామేరకు పాడేరులోనూ, ఉట్నూరులోనూ ఆనందలహరి కార్యక్రమం అమలు చేసినప్పుడు ఋషీవేలీ రూరల్ స్కూల్ వారు రూపొందించిన కరికులం ని మేం గిరిజన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసాం. ఆ కరికులం కింద రూపొందించిన కృత్యపత్రాల్ని నేరుగా వాడకుండా వాటిని గిరిజన సంస్కృతికీ, గిరిజన సమాజానికీ సన్నిహితంగా ఉండేలా సరిదిద్దుకుని మరీ అమలుచేసాం.