నిన్నటి ఉషనీ, నేటి ఉషనీ ఎట్లా వేరుచేయలేమో, నిన్నటి మానవుడినుంచి రేపటి మానవుణ్ణి కూడా వేరుచేసి చూపలేం. ఉష బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. మానవుడు కూడా బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. నేను ఉండను, కాని మనిషి కొనసాగుతాడు.
గొప్ప నేత
సూనృతాలవైపు నడిపించే గొప్ప నేత. చిత్రకాంతుల్తో ఆమె మనకోసం తలుపు తెరిచింది. జగత్తుని వెలిగిస్తున్నది, ఐశ్వర్యవరదాయిని. ఆమె వల్లనే భువనాలన్నీ ప్రకాశిస్తున్నవి
