ఆయన్ని ఏమని వివరించాలి? కళాకారుడందామా? అటువంటి కళాకారుడు మరొకడు కనబడడు. సాంస్కృతిక వేత్త అందామా? భారతీయ సంస్కృతిని అంత స్పష్టంగా టాగోరూ, అరవిందులూ కూడా అర్థం చేసుకోలేదు. ఆర్థిక వేత్త అందామా? బహుశా గాంధీజీ తర్వాత భారతీయ గ్రామీణ వ్యవస్థ గురించి అంత సాధికారికంగా మాట్లాడగలిగింది ఆయనొక్కడే.
