నాలుగు ప్రసంగాలు

రావిశాస్త్రి 102 వ జయంతి సందర్భంగా ఉదయిని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభలో నా ప్రసంగాల సారాంశాన్ని నిన్ననే మిత్రుల్తో పంచుకున్నాను. ఆ ప్రసంగాల వినాలని ఆసక్తి ఉన్నవారికోసం వీడియో లింకులు ఇక్కడ పంచుకుంటున్నాను.

రావిశాస్త్రి వారసులు

అంటే ఒకవేళ రావిశాస్త్రి ఇప్పుడు మనమధ్య ఉండి ఉంటే, ఇంకా కథలు రాస్తూ ఉండి ఉంటే, ఈ యువకథకుల్లాగా రచనలు చేస్తూ ఉండేవారని అనుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.

ముగ్గురు కథకులు-1

నాగేంద్ర కాశి, ఝాన్సి పాపుదేశి, రమేష్ కార్తిక్ నాయక్ లకు రావిశాస్త్రి కథాపురస్కారం లభించిన సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ఆ కథల మీద నేను కూడా నా అభిప్రాయాలు పంచుకున్నాను. ఆ ప్రసంగాల వీడియో లింకులు కుమార్ కూనపరాజు గారు పంపించారు. వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. రాజు గారికి కృతజ్ఞతలు.