ఉన్నదా ఆ ప్రణయబంధము? లేక ఈ పూరేక మాదిరి వడలిసడలినదా?
రేడియం తవ్వితీయడం
ఈ కవితల్లో కవి కొన్ని సార్లు ఏకాకి, కొన్ని సార్లు మహాసాంఘికుడు, కొన్ని సార్లు కైదీ, కొన్ని సార్లు స్వేచ్ఛాగాయకుడు. రష్యాలో కవిత్వం ఒక జీవన్మరణ సమస్య అన్నాడు యెవ్తుషెంకో. ఈ సంకలనంలోని మహాకవులంతా మృత్యువుతో ముఖాముఖి నిలబడి కవిత్వం చెప్పినవారే.
బహిరిసన్స్ బుక్ సెల్లర్స్
బహిరిసన్స్ నన్ను నిరాశ పర్చలేదు. హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలు రెండింటిలోనూ కలిపి కూడా నాకు కనిపించనంత కవిత్వం, కొత్తదీ, పాతదీ కూడా ఇక్కడ నాకు కనిపించింది.
