ఇన్నాళ్ళకు కోసక్కులు చదివేక నాకు అర్థమయిందేమంటే, తనలోని ఈ విముక్తి అవసరాన్ని ఆయన కాకసస్ లోని తొలిరోజుల్లోనే గుర్తుపట్టాడని. పూర్వరచయితల్లాగా ఆ ప్రకృతిని ఒక సుందరసీమగా మాత్రమే ఆయన చూడలేకపోయాడు. అక్కడ స్వతంత్రంగా జీవించే మనుషులున్నారనీ, నువ్వు నిజంగా ఆ సీమని ప్రేమిస్తే, నువ్వు చెయ్యవలసింది ముందు వాళ్ళల్లో ఒకడివి కావడమేననీ ఆయన గుర్తుపట్టాడు.
ఎక్కడి పుష్కిన్! ఎక్కడి చినవీరభద్రుడు!
కానీ, ఊహించలేదు, ఒకరోజు ఈ కవిత గురించీ, పుష్కిన్ గురించీ, నా గురించీ, కోకిల గురించీ ఒక మిత్రురాలు నేరుగా రష్యన్ మిత్రులముందే ముచ్చటిస్తారని!
రష్యన్ హేమంతం
ఇంతకీ ఈ కవితలో ఆ మేడమీద, ఆ సాయంకాలపు సంధ్యవేళ ఉత్తరాన్నుంచి మంచుగాలి వీస్తున్నప్పుడు, ఆ కవోష్ణదేహం పొగలు కక్కడం మొదలుపెట్టాక, ఆ రాత్రి ఏమై ఉంటుంది?
