పునర్యానం-41

నిజానికి ప్రతి ఒక్క కవీ కోరుకోవలసింది ఇదే. అది శ్రోతతాలూకు అమంగళాన్ని పోగొట్టడం కన్నా ముందు కవి జీవితంలోని అమంగళాన్ని పోగొట్టాలి. ఒక కవిత అలా నాలోని శివేతరమైనదాన్ని క్షాళితం చేస్తుందని తెలిసిన తర్వాత, ఇక నేను కవిత్వ చరణాలు పట్టుకుని ఒక్కరోజు కూడా వదిలింది లేదు.

పునర్యానం-40

దీన్నే మరోలా చెప్పాలంటే, ఎప్పుడు నీ ఆత్మ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతోందో, అప్పుడు నువ్వు ఉండటం లేదన్నట్టు. అది మృతి. ఉపనిషత్తు అమృతం గురించి మాట్లాడింది. అమృతం అంటే చావు లేకపోవడం కాదు, అసలు చావు గురించిన భయం లేకపోవడం. నీ దగ్గర మరణించడానికి మరేమీ మిగలకపోవడం.

పునర్యానం-39

కాని దానికన్నా ఎన్నో రెట్లు అధికమైంది దివ్యానందం. అది ఈ ప్రపంచం నుంచే పొందేదేగానీ, ఈ ప్రపంచపు కొలతలకు అందేది కాదు. అది సాఫల్య, వైఫల్యాలకు అతీతమైంది. అన్ని రకాల లెక్కలకీ అవతలది. కబీరు అంటాడే 'నువ్వు వెళ్ళబోయే దేశంలో సంతలూ, దుకాణాలూ ఉండవు' అని. అట్లాంటి దేశానికీ, లోకానికీ చెందిన అనుభూతి అది.