అప్పుడు మొత్తం మానవజాతికి భయమంటే తెలుస్తుంది భగవంతుడు ఏమి చేసాడో చెప్పుకుంటారు ఏమి చేసి చూపించాడో తలుచుకుంటారు.
జయగీతాలు-11
మనుషులు నిమ్నస్థానాల్లో ఉండటం క్షణిక సత్యం. ఉన్నతస్థానాల్లో ఉన్నారన్నది ఒక భ్రమ దేవుడి తక్కెడలో అవి తేలిపోతాయి.
జయగీతాలు-10
నేను మటుకు భగవంతుడి ముంగిట్లో పచ్చటిచెట్టులాంటి వాణ్ణి.
