వాటిలో స్తుతులున్నాయి, నతులున్నాయి, ఆత్మ విశ్వాసగీతాలున్నాయి, ధన్యవాద సమర్పణలున్నాయి, నిరసనలున్నాయి, విలాపాలున్నాయి. ప్రపంచమంతా భగవద్భక్తులు ఎన్ని మానసిక అవస్థలకు లోనవుతూ కవిత్వం చెప్పారో ఆ అవస్థలన్నీ ఆ గీతాల్లో కనవస్తాయి.
ఈశ్వరస్తుతిగీతాలు-1
కాని ఆ చివరి మాటలు ఏసువి కావనీ, ‘ఏలీ ఏలీ లామా సబ్బాచేతానీ’ అనే ఆ అరమాయిక్ పదాలు పాతనిబంధనలోని కీర్తనల్లో 22 వ కీర్తనలోని ప్రథమ పంక్తి అని తెలిసినప్పుడు నాకు గొప్ప కుతూహలం కలిగింది. ఆ కీర్తన మొత్తం చదివాను
దివ్యప్రేమగీతం-1
ఈ ఉద్యానంలో దేవుడి ప్రస్తావన లేదు, నిజమే, కాని సైతాను కూడా లేడు. మనిషికీ, మృగానికీ మధ్య విరోధం లేదు. ఆధిపత్యం లేదు, ఒకరినొకరం అణచివేసుకోడం లేదు. కాబట్టి ఆ ఉద్యానమే ఒక దైవం. దేవుడి ప్రస్తావనలేని దైవానుభవం ఈ గీతం.
