ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్ బహిర్ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.
