నీ ఇంటికొచ్చినవారిచేతుల్లో ఈ పూట ఒక పూలగుత్తి పెట్టు. ఎవరికి తెలుసు? కొత్త సంవత్సరం వారిచరణాలతో నీ ఇంట అడుగుపెడుతూండొచ్చు.
ఉత్తర ద్వారం
ఈ కాలమంతా ఒక తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది అది కనబడేది కాదు వినబడేది. ..
ఇంకా తెల్లవారని వేళల్లో
ఇంకా తెల్లవారని వేళల్లో దేవతలు తిరుగుతుంటారు ఒక్కొక్క ఇంటికప్పుమీంచీ చంద్రుడు వాళ్ళని పలకరిస్తుంటాడు. ..
