నాకొచ్చిన ఓ ఉత్తరాన్ని నలుగురూ వినేలా వీథిలోనే చదివి వినిపిస్తుంది వసంతకాలపు వాన.
వసంతమేఘగర్జన
చూస్తూ ఉండగానే ఆకాశమంతా మబ్బులు చిక్కబడటం మొదలుపెడతాయి, ఇంటికి అతిథులు రాబోతున్నారనగానే రొట్టె కోసం పిండి కలపడం మొదలుపెట్టినట్టు ఒక ప్రతీక్ష.
ఒక రోజంతా ఎండలో రగిలిపోయేక
ఒక రోజంతా ఎండలో రగిలిపోయేక ఉన్నట్టుండి సాయంకాలానికి గులాబీల గాలి వీచింది.
