అదే వీథి, అడ్డదిడ్డంగా అవే కరెంటుతీగలు అదే దుమ్ము, అవే బిల్డింగులు అదే మార్కెటు, అవే హారన్లు వాటిమధ్య అకస్మాత్తుగా ఆకుపచ్చని ఫౌంటెను తెరిచినట్టు మా ఇంటిముందు కానుగచెట్టు.
తలుపులు బార్లా తెరుచుకుంటాయి
కార్తిక ప్రభాతాల్లో నదీస్నానంకోసం కొందరు సంవత్సరమంతా ప్రతీక్షించినట్టు మాఘమాసపు సాయంకాలాల గాలులకోసం నేను ఏడాదిపొడుగునా ఎదురుచూస్తాను.
