అంటున్నాడు తుకా-19

నా ఫిర్యాదులు ఎవరికి చెప్పుకోను? ఈ కటకట ఎప్పుడు ముగిసిపోతుంది? నేను చేజేతులా తగిలించుకున్న ఉచ్చు దీన్నుంచి నన్ను బయటపడేసేదెవరు?

అంటున్నాడు తుకా-18

ఒక దుకాణం తెరిచాను వచ్చినవారందరికీ రెండుచేతులా పంచిపెడతాను. సాధువు ఎంత ఉదారుడు! ఎంత ఉదారుడు! ఆయన భాండాగారం తరుగులేనిది.

అంటున్నాడు తుకా-15

సాధుసంతుల గ్రామంలో సదా ప్రేమప్రభాతం ఆందోళన ఉండదక్కడ, లేశమైనా దుఃఖముండదు. అక్కడకి పోయి ఒక యాచకుడిగా బతుకుతాను. వాళ్ళు రోజూ నాకింత భిక్ష పెడతారు.