పుష్పప్రీతి

తానిట్లా గీతాలల్లుకుంటూ ఉంటే లోకానికి ఏం మేలు జరుగుతుందని ఒకసారి ఎవరో టాగోర్ అని అడిగారట. అందుకాయన ఈ పొగడచెట్టు వల్ల ఈ ప్రపంచానికి ఎంత ప్రయోజనమో తన కవిత్వం వల్లా అంతే అని సమాధానమిచ్చాడట.