తేనెసోన

వసంతమంటే ఏమిటి? చిగురించడమే కదా. అంతదాకా ఎండిపోయిన పత్రవృంతాల్లో కొత్త చిగురు ఎట్లా తలెత్తిందో పెద్దన చెప్పిన ఈ పద్యం ప్రపంచసాహిత్యంలోనే ఒక అపూరూపమైన పద్యం అనిపిస్తుంది నాకు.

ఏ విహంగము గన్న

అనువాదం చేసినప్పుడు కవిత్వంలో నష్టపోనివాటిల్లో మొదటిది మెటఫర్ అయితే, తక్కిన రెండూ, భావమూ, ఆవేశమూనూ. భావాన్ని మూడ్ అనవచ్చు. మనం భావకవిత్వంగా పిలుస్తున్నది మనకి విమర్శకులు చెప్పినట్టు రొమాంటిసిస్టు కవిత్వం ప్రభావం వల్ల రాసిన కవిత్వంకాదు.