ఇటువంటి అలభ్య, ఆదర్శ జీవితాన్ని అతడు ఎంతో కొంత మేరకు జీవించగలిగాడని మనకు ఆ కవిత్వం సాక్ష్యమిస్తుంది. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో, తిరిగి ఇటువంటి నిర్మలానుభూతి కనిపించేది కబీర్ పదాల్లోనూ, చెకోవ్ కథల్లోనూ మాత్రమే.
పాలపళ్ళ వాగు
చాలాకాలంగా ఎదురుచూస్తున్న తావో యువాన్ మింగ్ 'సెలెక్టెడ్ పొయెమ్స్'(పండా బుక్స్, 1993) నిన్ననే వచ్చింది. సుమారు ముఫ్ఫై కవితలు, గతంలో చాలా సంకలనాల్లో చాలా సార్లు చదివినవే. కాని విడిగా ఒక పుస్తకంగా చూసినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది కదా.
