ఆ మోహవిషాద సౌందర్యం బహుశా హిందీ, ఉర్దూ కవులకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదనిపిస్తుంది. అందుకనే శైలేంద్ర, భరత్ వ్యాస్, రాజేంద్ర కృష్ణ, మజ్రూ సుల్తాన్ పురీ, షహ్రాయర్ లాంటి సినిమా కవుల్ని నేను ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవులుగా లెక్కేసుకుంటాను.
తేరే బినా జిందగీ..
ఇప్పుడేం చెప్తానంటే, అట్లాంటి యువతీయువకులు మీకు తారసపడితే ఈ పాటల పుస్తకాన్ని వాళ్ళకి కానుక చెయ్యండి అని. అంతేనా? మీరేదన్నా పెళ్ళికి అతిథిగా వెళ్తే ఆ నూతనవధూవరులకి ఈ పుస్తకాన్ని కానుక చెయ్యండి అని.
