బసవ పురాణం-5

తెలుగు పాఠకుల్లో కూడా చాలామందికి రూమీ గురించి తెలిసినంతగా సోమన గురించి తెలియదు. కాని కావ్యనిర్మాణ పద్ధతుల్లోగాని, కథనశైలిలోగాని, ఈశ్వరదర్శనం ఏ కొద్దిమంది పండితులకో కాకుండా ప్రజలందరికీ సుసాధ్యమేనని నమ్మడంలోనూ, చెప్పడంలోనూ కూడా సోమన, రూమీ ఒక్కలాంటివారేనని చెప్పడం ఈ రోజు ప్రసంగం ముఖ్యోద్దేశం.

రుద్ర పశుపతి

ఇందులో మతాన్ని పక్కన పెట్టండి, పశుపతీ, రుద్రపశుపతీ ఇద్దరూ నిజంగా ఉన్నారా లేరా అన్నది పక్కన పెట్టండి. కానీ, నిజంగా అట్లా నమ్మగలుగుతున్నామా మనం దేన్నయినా, మన స్నేహాల్నైనా, మన సిద్ధాంతాల్నైనా, చివరికి మన హృదయస్పందనల్నైనా?

శ్రీపర్వతప్రకరణం

అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.