ఈ వ్యాసాల్లో రచయిత తాను పరిచయం చేస్తున్న ప్రతి కళకారుడి గురించీ ప్రాథమిక సమాచారంతో పాటు, ఆయన లేదా ఆమె జీవనతాత్త్వికతను కూడా స్థూలంగా పరిచయం చేసారు. కళలో వారు సమాజానికి అందించిన ఉపాదానం గురించి సారాంశప్రాయమైన వాక్యాలు రాసారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యాసం చంద్రుణ్ణి చూపించే వేలు అని చెప్పవచ్చు.
ప్రకృతి తపస్వి
తాను చూస్తున్న దృశ్యానికి ఎటువంటి వ్యాఖ్యానాన్నీ జతపరచకుండా చూసింది చూసినట్టుగా చెప్పాలనే ఆ చిత్రకారుడి నిజాయితీ వల్ల మాత్రమే, ఆ కాలం గడిచిపోయినా, ఆ రష్యా రూపురేఖలు మారిపోయినా, ఆ సౌందర్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.
