ఆవిరిపూల కొమ్మ

అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతులు, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ.