ఈవొలస్ ద్వీపం నుంచి మళ్ళా తన నౌకలతోనూ, నావికులతోనూ అగమ్యంగా సముద్రం మీద బయలుదేరిన ఒడెస్యూస్ ని అల్లకల్లోలంగా ఉండే సముద్రం మరీ తీరానికి నెట్టివేసింది. అక్కడొక పొడవైన యువతి వాళ్ళకు కనబడి తమ ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఆహ్వానించింది.
ఒడెస్సీ-2
కొత్త సంవత్సరం సోమయ్యగారింట్లో గడిచింది. రావెల సోమయ్యగారు, అరుణగారి ఆతిథ్యం, వారి ప్రేమ, ఆప్యాయతా ఇప్పటి కాలానివి కావు. మధ్యాహ్నం భోజనాలయ్యాక, 'ఇప్పుడు మీరు ఒడెస్యూస్ గురించి చెప్పండి ' అన్నాడు గంగారెడ్డి.
ఒడెస్సీ-1
ఒడెస్సీ చదవడం పూర్తిచేసాను. గ్రీకు ఇతిహాసకారుడు అల్లిన రెండు ఇతిహాసాల్లోనూ, 'ఇలియడ్' ఇరవయ్యేళ్ళ కిందటే చదివాను. కాని, ఒడెస్సీనే ఇప్పటికి పూర్తిగా చదవగలిగాను.
