ఆ బంభర నాదం

అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?

తేనెసోన

వసంతమంటే ఏమిటి? చిగురించడమే కదా. అంతదాకా ఎండిపోయిన పత్రవృంతాల్లో కొత్త చిగురు ఎట్లా తలెత్తిందో పెద్దన చెప్పిన ఈ పద్యం ప్రపంచసాహిత్యంలోనే ఒక అపూరూపమైన పద్యం అనిపిస్తుంది నాకు.