కవిత్వహిమాలయ సంచారి

ఇంగ్లిషులో phenomenon అని ఒక పదం ఉంది. కంటికి కనిపించే ఒక యథార్థమైన విషయం అనే అర్థంలోనే కాకుండా, మనల్ని అబ్బురపరిచే ఒక మనిషిని సూచించడానికి కూడా ఆ మాట వాడతారు. నాగరాజు రామస్వామిగారిని అభివర్ణించాలంటే ఆయన ఒక phenomenon అని అనాలి

అనుస్వరం

నాగరాజు రామస్వామిగారు, ఎలనాగ గా ప్రసిద్ధి చెందిన వారి తమ్ముడు నాగరాజు సురేంద్ర గారు కరీంనగర్ తెలుగుసాహిత్యానికి అందించిన గొప్ప కానుకలు. వారిది కరీంనగర్ జిల్లా ఎలిగందల. రామస్వామిగారు ఉద్యోగరీత్యా చాలాకాలం అరబ్బు, ఆఫ్రికా దేశాల్లో ఇంజనీరుగా పనిచేసారు.