ఇటువంటి సాహిత్యరత్న పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైన వాడు అనే ఆ రోజు వక్తలంతా చెప్పింది. వారి మాటల్నే నేను కూడా పునరుక్తి చేస్తూ, అదనంగా చెప్పిందేమంటే, ఆయన ఇప్పటి తరాన్ని ఎంత చేరదీసుకుని ఉండేవాడో, ఇప్పటి తరం కూడా ఆయనకి అంతే చేరువగా జరిగి ఉందురనే.
అన్నిటికన్నా ముందు విద్యావేత్త
ఇంటర్నెట్ లో కిర్క్ గార్డ్ కారిడార్ వున్నట్లే గురజాడ వరండా కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడి పాఠకులూ చేరి కొంతసేపు తమకి తోచిన నాలుగు మాటలు మాట్లాడిపోతూ ఉండాలి.
