ప్రతి మీనియేచర్ చిత్రలేఖనంలోనూ కనవచ్చే ఆ రంగులు, ఆ రేఖలు, ఆ లలితసుందరమైన భావోద్వేగమూ చూడగానే మనల్ని సమ్మోహపరచడం మనకి అనుభవమే కదా. అకనానూరు కవితల్లో కూడా ఆ రంగులు, ఆ రేఖలు కలిసి సున్నితంగా చిత్రించే రసరమ్యలోకం అనువాదాల్ని కూడా దాటి ప్రయాణించగలిగింది అని మనం గ్రహిస్తాం.
సర్వశ్రేష్ఠ మీనియేచర్ చిత్రకారుడు
ఒకసారి నేనాయనతో 'మీరు హిమాలయాల్ని అజరామరం చేసారు' అని అంటే, ఆయన చిరునవ్వి 'లేదు, నువ్వు పొరబడుతున్నావు దేవ్, హిమాలయాలే నన్ను అజరామరం చేసాయి' అన్నాడు.'
