సచ్చిదానందమూర్తి-2

సత్యాన్ని అవగతం చేసుకోవాలనుకున్నవాళ్ళు వీలైనన్ని పార్శ్వాల్తో పరిచయం పెంచుకోవాలి. బహుళమతానుయాయుల్ని సంప్రదించాలి. ఆ పద్ధతిలో నీకు సత్యం చేజిక్కినా చేజిక్కకపోయినా, ముందు నువ్వు సహజీవనానికి అవసరమైన సహిష్ణుత నేర్చుకోగలుగుతావు.