ఇప్పటి యువతీయువకులూ, కవులూ, కథకులూ ఎంతమంది గోర్కీని చదువుతున్నారో తెలియదుగానీ, మా తరందాకా గోర్కీని చదవడం తప్పనిసరిగా ఉండేది. ఇంకా చెప్పాలంటే నువ్వొక సాహిత్యబృందంతో కలిసి తిరగాలంటే గోర్కీని చదివి ఉండటం ఒక అలిఖిత సభ్యత్వ నిబంధనలాగా ఉండేది.
ఆంటోన్ చెకోవ్ కథలు-2
ఒకప్పుడు రష్యాలో ఇటువంటి కాలాన్ని ధిక్కరిస్తో ఒక టాల్ స్టాయి, ఒక చెకోవ్, ఒక గోర్కీ వంటి వారు రచనలు చేసారు. కాని మన దేశంలో ఇప్పుడు అటువంటి రచయితలు కనబడకపోగా కనీసం అటువంటి రచయితలు అవసరమని నమ్మేవాళ్ళు కూడా కనిపించట్లేదు.
