సుబ్బారావుగారి వాక్యంలో ఒక వింత సొగసు ఉంటుంది. అది అచ్చు ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. సూటిగా, తేటగా, నిరలంకారంగా, కానీ ఎంతో సానునయంగా, ప్రేమగా. మనకు తెలిసిన కథలే, కాని ఆయన వాక్యాల్లో చదివినప్పుడు, మళ్ళా కొత్తగా కనిపిస్తాయి. ఈ జెన్ కథలు చదువుతున్నప్పుడు కూడా అదే అనుభూతి నాకు.
