మాలతీచందూర్

నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.