ఒకప్పుడు రాజమండ్రిలో సాహితీవేదిక అనే సాహితీబృందం ఉండేది. ఆ సంస్థ 1980 డిసెంబరు 25 న ఏర్పాటయింది. ఆ రోజుని గుర్తుపెట్టుకుని గతమూడేళ్ళుగా అప్పటి మిత్రులు డిసెంబరు 25 నాడు రాజమండ్రిలో కలుస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా గౌతమీ గ్రంథాలయంలో మళ్ళా కలుసుకున్నారు. ఆ సందర్భంగా నా పుస్తకాలు రెండు ఆవిష్కరణకు నోచుకున్నాయి.
పాతాళభైరవి
జానపదకథలన్నింటిలోనూ ఉండే అమాయికమైన నైతికతనే పాతాళభైరవిలో కూడా ఉన్నది. నువ్వు అదృష్టమ్మీదనో, మరొకరి శక్తి మీదనో ఆధారపడి ఎంతైనా సంపాదించవచ్చుగాక, అది నిలబడదు. కలకాలం నిలబడేదల్లా నువ్వు సొంతంగా ఏది సాధించగలవో అది మటుకే.
