ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్ బహిర్ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.
సంధ్యాసమస్యలు
కానీ ఈ రోజు ఎందుకనో, ఏవో ఆలోచనల మధ్య, ఈ కవిత గుర్తొచ్చి, ఇన్నేళ్ళుగానూ ఈ కవితను అర్థం చేసుకోవలసినట్టే అర్థం చేసుకున్నానా అని అనుమానమొచ్చింది.
మహాప్రస్థానం@75
ఈ ఏడాది మహాప్రస్థాన కావ్యం తాలూకు వజ్రోత్సవ సంవత్సరం కూడా! అందుకని, పదిహేనేళ్ళ కిందట, ఆ కావ్యం అరవై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో నేను చేసిన ప్రసంగం ఈ రోజు కూచుని మళ్ళా ఆసాంతం విన్నాను. మీరు కూడా వింటారని మరోసారి ఇక్కడ షేర్ చేస్తున్నాను.
