కథలు ఎలా పయనించేయి-3

ప్రాచీన భారతదేశ కథాచట్రాన్ని మధ్యయుగ భారతదేశానికి మధ్యయుగ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దినవారు జైనులు. జైనులు నిర్వహించిన ఈ మహోన్నత చారిత్రక  సాహిత్య పాత్ర గురించి దురదృష్టవశాత్తూ ఈనాటి రచయితలకీ, పండితులకీ, పాఠకులకీ కూడా దాదాపుగా తెలియదనే చెప్పాలి. కాని జైనులే లేకపోతే, భారతీయ సాహిత్యం ఇలా ఉండి ఉండేదే కాదు.

కథలు ఎలా పయనించేయి-2

మనం మహాభారతాన్ని ఇతిహాసంగా లెక్కేస్తాం తప్ప కథాచట్రంగా లెక్కవెయ్యం. మధ్యయుగాల కథానిర్మాణం కథాచట్రపద్ధతిలో నడవడానికి కారణమైంది బృహత్కథ, పంచతంత్రం తప్ప మహాభారతం కాదు. ఎందుకని

ప్రళయాంతవేళ

ప్రళయం ముంచెత్తిన ప్రతి యుగాంతవేళా, నాతో పాటు, వటపత్రప్రమాణంకలిగిన కించిదూర్జిత స్ఫూర్తికూడా ఒకటి జీవించి ఉండటం కనుగొన్నాను