ఇటువంటి సాహిత్యరత్న పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైన వాడు అనే ఆ రోజు వక్తలంతా చెప్పింది. వారి మాటల్నే నేను కూడా పునరుక్తి చేస్తూ, అదనంగా చెప్పిందేమంటే, ఆయన ఇప్పటి తరాన్ని ఎంత చేరదీసుకుని ఉండేవాడో, ఇప్పటి తరం కూడా ఆయనకి అంతే చేరువగా జరిగి ఉందురనే.
మేలిమి సభలు
ఆ రోజు అచ్చంగా ఆరుగురమే ఉన్నాం. అది నా జీవితంలో నేనింతదాకా హాజరైన కవిత్వావిష్కరణ సభల్లో మరీ మేలిమి సభల్లో ఒకటని మరో మారు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
