లోతైన కథలసముద్రం

సమీక్ష విహంగ వీక్షణం అయితే, విమర్శ రచనని మరింత ఉన్నతమైన అమూర్తతా స్థాయికి (Higher level of abstraction) తీసుకెళ్లాలని అంటారు. మరి ఇటువంటి సమర్థవంతమైన సద్విమర్శని సమగ్రంగా, వివేచనవంతంగా ఎలా విశ్లేషించాలి? ఇది ఈ వ్యాసకర్తకి సవాలు

నిజంగా భాగ్యం

ఈ నెల రెండో తేదీన రావిశాస్త్రి పురస్కారవేదిక సభలో నా 'కథలసముద్రం' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా డా.కొర్రపాటి ఆదిత్య ఆ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఒక తరానికి చెందిన రచయితకి తన తర్వాతి తరం నుంచి ఇటువంటి మూల్యాంకనం దొరకడం నిజంగా భాగ్యం

కథల సముద్రం ఆవిష్కరణ

గత ఆరేడేళ్ళుగా కథలమీదా, కథకులమీదా, నవలల మీదా నేను రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరిట సంకలనం చేసి ఈ-బుక్కుగా మీతో పంచుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఈ-బుక్కును ఎన్నెలపిట్ట ప్రచురణసంస్థ తరఫున శెషు కొర్లపాటి పుస్తకంగా తీసుకొచ్చేరు. ఈ రోజు బషీర్ బాగు ప్రెస్సు క్లబ్బులో జరిగిన రావిశాస్త్రి పురస్కార ప్రదాన సభలో ఈ పుస్తకాన్ని మహమ్మద్ ఖదీరు బాబు ఆవిష్కరించేరు. పుస్తకాన్ని డా.కొర్రపాటి ఆదిత్య అద్భుతంగా పరిచయం చేసారు.