సర్వోత్తమ దార్శనికుడు

వేమన గురువు అంటే సాంప్రదాయిక అర్థంలో గురువు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి అత్యవసరమైన జీవనవిద్యను ప్రతిపాదిస్తున్న గురువు అని కూడా. అంటే, చాలా మనకి సుపరిచితంగా, ఇంక వాటిల్లోంచి కొత్తగా ఏ అర్థాలూ స్ఫురించడానికేమీ లేదనే పద్యాల్లో కూడా వేమన మనకి సరికొత్తగా వినిపిస్తున్నాడు.

తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రం

ఎప్పుడేనా, ఎవరేనా ఒక కాంప్ బెల్ లాంటివాడు, కాంప్ బెల్ రాసింది చదివిన ఒక రాళ్ళపల్లి వంటివాడు, రాళ్ళపల్లిని చదివిన నాబోటివాడు ఈ దారమ్మట పోతున్నప్పుడు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు, సరళమైన, నిర్మలమైన, ధారాళమైన జీవితానుభూతికి లోనవుతారనడంలో అనుమానం లేదు