ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నెలపొడుగునా అమెరికాలో, కెనడాలో జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని 2018 లో ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన కొన్ని పరిచయ వ్యాసాలు రాసాను. వాటిలో డగ్లస్, డన్‌బార్, లాంగ్‌స్టన్ హ్యూస్, పాల్ రోబ్సన్ మీద వ్యాసాల్ని ఇప్పుడు కొద్దిగా విస్తరించాను. వారితో పాటు ఫిల్లిస్ వీట్లి, జార్జి మోజెస్ హోర్టాన్, రిచర్డ్ రైట్‌ల మీద కొత్తగా రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చేర్చాను. ఇప్పుడు ఈ పదిహేను వ్యాసాల్నీ 'వికసించిన విద్యుత్తేజం' పేరిట ఈ ఫిబ్రవరి నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఇలా విడుదల చేస్తున్నాను. ఇది నా 55 వ పుస్తకం. ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం వైపు నా దృష్టి మళ్ళించిన నా ఆత్మీయుడు కన్నెగంటి రామారావుకు ఈ పుస్తకాన్ని ప్రేమతో కానుక చేస్తున్నాను.
ఒక్క పాఠకుడు చాలడా!
ఆ ఎదురు చూపులు అలా నడుస్తుండగా, అమెరికాలో ఉంటున్న మిత్రులొకరు, నేనొక అమెరికన్ మహాకవి మీద రాసిన పుస్తకం చదివాననీ, ఆ పుస్తకం వల్ల తనకు మరికొన్ని పుస్తకాలు పరిచయమయ్యాయనీ చెప్తూ నా కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకం తేగానే, నాకు అమెరికామీదా, ఇండియా మీదా కూడా మళ్ళా గొప్ప ఆశ చిగురించింది.
వెంకటరత్నం మాష్టారు
ఆయన మాష్టారి క్లాసు ఆద్యంతం ముగ్ధుడైపోయి విన్నాడు. తాను ఆ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టినందుకు గర్విస్తున్నానని చెప్పాడు. అదొక అపురూపమైన దృశ్యం. నాకు తెలిసి, అంతకు ముందు ఎలానూ జరగలేదు, కనీసం ఈ యాభై ఏళ్ళల్లో మళ్ళా అటువంటి సంఘటన మన పాఠశాలల్లో జరిగినట్టు నేను వినలేదు!
