అంటే ఒక సౌందర్య శిఖరారోహణ అన్నమాట. అందులో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఆ సత్యాన్వేషి ఋషిగా మారి ఆ సోపానమార్గంలో కిందకి దిగి తన తోటిమనుషులకు తిరిగి ఆ దారిగురించి బోధిస్తాడని మనకి సింపోజియం చెప్పకనే చెప్తుంది. మనుషుల పట్ల ప్రేమలేకపోతే ఆ ఋషి తిరిగి మళ్ళా ఈ సాధారణ జీవితంలో అడుగుపెట్టవలసిన పనే లేదు.
గంగా ప్రవాహం
గంగా ప్రవాహంలాగా సరళంగా ఉండటం మంచి అనువాదం లక్షణం. కల్యాణి గారి ఈ అనువాదం చూసాక ఆమె మరిన్ని రచనలు కన్నడం నుంచీ, ఇంగ్లిషు నుంచీ తెలుగు చేయాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా?
