పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా రెండువారాల కిందట 'మేఘసందేశం' మీద ప్రసంగాలు మొదలుపెట్టాను. కిందటివారం విరామం తర్వాత ఈ రోజు రెండవ ప్రసంగం. ఈ ప్రసంగంలో మేఘసందేశం గురించిన మరికొన్ని పరిచయ విశేషాలతో పాటు మొదటి సర్గలోని మొదటి ఆరు శ్లోకాల్లోని విశేషాలను పంచుకున్నాను.
పుస్తక పరిచయం-22
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు కాళిదాసు మేఘసందేశం కావ్యం పైన ప్రసంగించాను. సుప్రసిద్ధమైన ఈ కావ్యాన్ని చాలామంది ఒక ప్రణయగీతంగా గుర్తుపెట్టుకుంటారు. కాని ఇది ఒక శుభాకాంక్షగీతం
ఆకాశాన్ని కానుకచేసే ఋతువు
ఆహా! ఇంకా చాతకం బతికే ఉన్నది, నిప్పులు కక్కిన వేసవి మొత్తం ఆ ఉగ్రమధ్యాహ్నాల్ని అదెట్లా సహించిందోగాని, ఒక్క వానచినుకుకోసం, ఒక్క తేమగాలి తుంపర కోసం అదెట్లా ప్రాణాలు గొంతులో కుక్కుకుని ఇన్నాళ్ళూ గడిపిందోగాని, వానకోయిలకీ, కారుమబ్బుకీ ఉన్న ఈ అనుబంధం ఇన్ని యుగాలైనా ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం నాకు ధైర్యానిస్తున్నది.
