అకథలు-2

అకథ అంటే కథగానిది. కాని దానిలో ఒక కథాస్ఫురణ ఉంటుంది. అలాగని దాన్ని మనం కథగా మారిస్తే దానిలోని కథ అదృశ్యమైపోయి అది నిజంగానే అకథగా మిగిలిపోతుంది.

నలుగురు పాండవులు

ఈ విచ్ఛిత్తిలో ఒక క్రియాశీలత్వం కూడా వుంది. విగ్రహాల్ని ధ్వంసం చెయ్యడం లాంటి విచ్ఛిన్నం కాదిది. గుడ్డుని విచ్ఛిన్నం చేసుకుని ప్రాణి బయటపడటం లాంటి విచ్ఛిన్నత. ఇది ఏకకాలంలో విధ్వంసకం, సృజనాత్మకం కూడా.

వెళ్ళిపొయ్యాడతడు

సాయంకాలమంతా గడిపాక 'ఇక వెళ్ళొస్తాన' ని తన ఇంటికో, గదిలోకో, తనుండే ఊరికో వెళ్ళినట్టే వెళ్ళిపోయాడతడు, మరేమీ చెప్పకుండా వదిలి ఉంచకపోయినా ఏ సంకేతాలూ.