రమణీయ నీలిమ మధ్య చర్చి గోపురం తగరపు విమానంతో వికసించింది. వసంతపక్షుల కూజితాలు దాని చుట్టూ అల్లుకున్నవి. ..
హోల్డర్లిన్-5
మహిమోపేతమైన ఈ రాత్రి కురిపిస్తున్న కరుణ ఆశ్చర్యకారకం, ఆమె ఎక్కణ్ణుంచి వస్తున్నదో ఎరిగినవారు లేరు, ఆమెనుంచి ఏమి తలెత్తనున్నదో తెలిసినవారూ లేరు.
హోల్డర్లిన్ -3
ఆకుపచ్చమీదా, కొండకోనమీదా బొమ్మ గీసినట్టుగా కనిపిస్తున్న అడవి అంచుల్లో నేను నడిచినప్పుడల్లా నా గుండెలో బాధిస్తున్న ప్రతి ముల్లుకీ గొప్ప ప్రశాంతి నన్ననుగ్రహిస్తుంది.
